కొత్త సినిమా ఎనౌన్స్ చేసిన రాజశేఖర్

Monday,August 19,2019 - 06:13 by Z_CLU

కల్కి మూవీ తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. సరికొత్త స్టోరీలైన్ తో ఎమోషనల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాను జి.ధనుంజయన్ నిర్మిస్తారు. సింగిల్ లైన్ కథ విని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట రాజశేఖర్.

ఈ సినిమాను ప్రదీప్ కృష్ణమూర్తి డైరక్ట్ చేయబోతున్నాడు. గతంలో ఇతడు క్షణం సినిమాను తమిళ్ లో రీమేక్ చేశాడు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన భేతాళుడు సినిమాను డైరక్ట్ చేసింది కూడా ఇతడే. ఇప్పుడు రాజశేఖర్ హీరోగా తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయబోతున్నాడు.

సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించబోతున్న ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు. ఈమధ్య రిలీజైన ‘కిల్లర్’ సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్ ఈ కొత్త సినిమాకు సంగీతం అందిస్తాడు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చిలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.