రాజశేఖర్ కొత్త సినిమా అప్ డేట్స్
Monday,September 09,2019 - 05:11 by Z_CLU
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై ధనుంజయన్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. అక్టోబర్‌లో సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. తమిళ దర్శకుడు, ప్రముఖ మాటల రచయిత జాన్ మహేంద్రన్ నేతృత్వంలో స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశారు.
రాజశేఖర్ మాట్లాడుతూ… ‘‘కథ చాలా బావుంటుంది. చక్కటి స్క్రీన్ ప్లే కుదిరింది. కథనం ఉత్కంఠభరితంగా, అదే సమయంలో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కథ విన్న వెంటనే ఓకే చేసేశా. స్క్రీన్ ప్లేకీ వెంటనే ‘యస్’ చెప్పాను. అంత ఎగ్జయిటింగ్‌గా స్క్రీన్ ప్లే ఉంటుంది’’ అని అన్నారు.
అక్టోబర్‌లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేయబోతున్నారు. హైదరాబాద్, చెన్నైలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తికీ తెలుగులో తొలి చిత్రమిది. విజయ్ ఆంటోనీ హీరోగా ‘భేతాళుడు’కు దర్శకత్వం వహించిందీయనే.
