ఆ దర్శకుడితో రాజశేఖర్ సినిమా?

Saturday,June 06,2020 - 12:53 by Z_CLU

ఇటివలే రక్షిత్ హీరోగా తెరకెక్కిన ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు  కరుణ కుమార్.  ‘పలాస’ చూసిన రాజశేఖర్, కరుణతో ఒక సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఆ మధ్య కరుణ కుమార్ తో ఓ రీమేక్ సినిమాకు సంబంధించి రాజశేఖర్ చర్చించారని, దానికి కరుణ ఓకే అన్నాడట.

‘కల్కి’ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. వీరభద్రంతో ఒక సినిమా కమిట్ అయ్యాడు. అలాగే కరుణ కుమార్ ‘పలాస’ విడుదలకి ముందే గీతా ఆర్ట్స్ సంస్థ నుండి రెండో సినిమాకు అడ్వాన్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకి కథ రెడీ చేసుకునే పనిలో ఉన్నాడు కరుణ.

అలాగే సితార బ్యానర్ లో ఓ సినిమా కమిట్ అయ్యాడు. సో.. ముందుగా కమిట్ అయిన ఈ ప్రాజెక్ట్స్ తర్వాతే కరుణ కుమార్.. రాజశేఖర్ తో సినిమా చేసే అవకాశం ఉంది. మరి ఈ లోపు ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.