రాజశేఖర్ 'కల్కి' టీజర్ రిలీజ్

Monday,February 04,2019 - 12:46 by Z_CLU

ఆంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా టీజర్ రిలీజయింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రాజశేఖర్ జన్మదినం సందర్భంగా బర్త్ డే టీజర్ రిలీజ్ చేసారు.

వర్షంలో  గొడుగు పట్టుకొని రాజశేఖర్ ఫైట్ చేసే యాక్షన్ పార్ట్ తో రిలీజయిన ఈ టీజర్ సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది.   సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో.. యాక్షన్ పార్ట్ కి ఎంత స్కోప్ ఉందో.. లాంటి విషయాలను టీజర్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసారు మేకర్స్.

హ్యాపీ మూవీస్ . శివాని శివాత్మిక మూవీస్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సి.కళ్యాణ్ , శివాని శివాత్మిక నిర్మాతలు.