రామ్ సినిమాలో సీనియర్ హీరో ?

Tuesday,May 01,2018 - 02:08 by Z_CLU

ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలో నటిస్తున్నాడు  రామ్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ప్రవీణ్ సత్తారు తో రామ్ మరో సినిమా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సీనియర్ హీరో  డా.రాజశేఖర్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది.  రీసెంట్ గా ‘గరుడ వేగ’ సినిమాతో సూపర్ హిట్ అందించిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయమని అడగడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట రాజశేఖర్.

స్రవంతి మూవీస్ బ్యానర్ పై యాక్ష‌న్, అడ్వంచ‌ర‌స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా మే 7 న సెట్స్ పైకి రానుంది.  జార్జియా లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమా తర్వాత స్విట్జ‌ర్లాండ్‌, ఫ్రాన్స్, ఇట‌లీలో షూటింగ్ జరుపుకోనుంది.