Gopichand Sriwass Movie - విలన్ గా సీనియర్ హీరో?

Monday,August 09,2021 - 05:16 by Z_CLU

ప్రెజెంట్ మారుతి డైరెక్షన్ లో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ శ్రీవాస్ డైరెక్షన్ లో తన ముప్పయివ సినిమా చేయబోతున్నాడు. ఇటివలే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. హీరోయిన్ తో పాటు మిగతా కాస్టింగ్ కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు శ్రీవాస్. అయితే సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

ఇటివలే రాజశేఖర్ ని కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట దర్శకుడు. గతంలో చాలా సినిమాల్లో క్యారెక్టర్స్, విలనీ రోల్స్ వదులుకున్న రాజశేఖర్ ఈ సినిమాలో విలన్ గా ఒప్పుకున్నడనే ప్రచారం హాట్ టాపిక్ అవుతుంది. కెరీర్ ఆరంభంలో విలన్ గా నటించి తర్వాత హీరోగా టర్న్ అయిన గోపీచంద్ ప్రస్తుతం మ్యచో హీరోగా దూసుకెళ్తున్నాడు. మరి గోపీచంద్ సినిమాలో రాజశేఖర్ విలన్ అంటే ఇంట్రెస్టింగే.

rajasekhar-kalki-zee-cinemalu11

గతం గోపిచంద్, జగపతి బాబు కాంబినేషన్ లో ‘లక్ష్యం’ సినిమా తీశాడు శ్రీవాస్. కాకపోతే అందులో జగపతి బాబు గోపిచంద్ కి అన్నగా పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఇప్పుడు రాజశేఖర్ ని విలన్ గా చూపించదానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ నుండి ప్రకటన ద్వారా క్లారిటీ రానుందని సమాచారం. మరి రాజశేఖర్ ఇందులో ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics