మరో హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ

Monday,March 11,2019 - 01:55 by Z_CLU

రాజశేఖర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచింది గరుడవేగ సినిమా. మరీ ముఖ్యంగా యాంగ్రీ స్టార్ కెరీర్ ను మళ్లీ రేస్ ట్రాక్ పై నిలబెట్టింది ఈ మూవీ. తన కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ గా నిలిచిన గరుడవేగకు సీక్వెల్ చేయబోతున్నాడు రాజశేఖర్.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గరుడవేగ సీక్వెల్ త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని ప్రకటించాడు రాజశేఖర్. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని
బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ హీరో కల్కి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే గరుడవేగ పార్ట్-2 సెట్స్ పైకి వస్తుంది.

బాలీవుడ్ తో పోలిస్తే తెలుగులో సీక్వెల్స్ తక్కువ. కాకపోతే టైటిల్స్  మాత్రం రిపీట్ చేస్తుంటారు. మన్మధుడు-2, కాంచన-3 లాంటి సినిమాలు అలా వస్తున్నవే. కానీ గరుడవేగ సీక్వెల్ మాత్రం సిసలైన సీక్వెల్ గా రాబోతోంది.