రాజశేఖర్ దంపతులకు కరోనా పాజిటివ్

Saturday,October 17,2020 - 12:43 by Z_CLU

హీరో రాజశేఖర్, అతడి భార్య జీవితకు కరోనా ఎఫెక్ట్ అయింది. వీళ్లకు కరోనా సోకి వారం రోజులైంది. ప్రస్తుతం ఈ జంట హోం ఐసొలేషన్ లో ఉంది.

రాజశేఖర్ కు కరోనా రావడంతో అతడు చేయాల్సిన సినిమా ఆగిపోయింది. నీలకంఠ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాజశేఖర్. లెక్కప్రకారం ఈపాటికి ఈ సినిమా షూట్ స్టార్ట్ కావాలి. కానీ వైరస్ సోకడంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయింది.

టాలీవుడ్ నుంచి రాజమౌళి, నాగబాబు, కీరవాణి, తమన్న ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు రాజశేఖర్ దంపతులు కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నారు.