విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన రాజరథం వీడియో సాంగ్

Wednesday,January 17,2018 - 04:36 by Z_CLU

ఫిబ్రవరి 16 న రిలీజ్ కి రెడీ అవుతుంది రాజరథం మూవీ. గతంలో రానా వాయిస్ ఓవర్ తో ఇంట్రెస్టింగ్ టీజర్ ని రిలీజ్ చేసిన మూవీ టీమ్, ఈ రోజు కాలేజ్ డేస్ నేపథ్యంలో సాగే వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటను విజయ్ దేవరకొండ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా అనూప్ భండారి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ రోజు రిలీజైన ఈ సాంగ్ ని బాలీవుడ్ కోరియోగ్రాఫర్స్ బోస్కో- సీజర్ కంపోజ్ చేశారు. టీజర్ నుండి బిగిన్ అయితే ఈ సాంగ్ వరకు క్యూరాసిటీ రేజ్ చేయడమే పనిగా పెట్టుకున్న సినిమా యూనిట్, యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అవుతుంది.

జాలీ హిట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని అజయ్ రెడ్డి, అంజు వల్లభనేని, విష్ణు దకప్పగారి, సతీష్ శాస్త్రి కలిసి నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది రాజరథం టీమ్.