తండ్రి సినిమాకి రాజమౌళి వాయిస్ ఓవర్

Friday,May 26,2017 - 09:10 by Z_CLU

లేటెస్ట్ గా బాహుబలి తో దర్శకుడిగా సత్తా చాటి రికార్డులు తిరగరాసిన రాజమౌళి త్వరలో ఓ సినిమాకు వాయిస్ ఓవర్ అందించేందుకు రెడీ అవుతున్నాడట… ఇంతకీ జక్కన్న వాయిస్ ఓవర్ అందించబోతున్న ఆ సినిమా మరేదో కాదు కొత్త వాళ్ళతో తెరకెక్కిన ‘శ్రీవల్లి’ సినిమా.

రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో కొత్త వాళ్ళతో రూపొందిన ఈ సినిమాకు స్టార్టింగ్ లో రాజమౌళి వాయిస్ ఇస్తే బాగుంటుందని భావించిన విజయేంద్ర ప్రసాద్ తాజాగా రాజమౌళి ని తన వాయిస్ తో స్టోరీ నేరేట్ చేయమని అడిగాడట.. ఇందుకు వెంటనే ఓకే చెప్పిన రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ అందించేందుకు రెడీ అవుతున్నాడట. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి చేరుకున్న ఈ సినిమాకు తన వాయిస్ తో సినిమా పై హైప్ క్రియేట్ చేయబోతున్నాడన్నమాట రాజమౌళి..