చిరు151 మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్న రాజమౌళి

Monday,August 21,2017 - 03:17 by Z_CLU

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో స్వాతంత్రసమరయోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ కథతో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న చిరు151 సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను రేపు చిరు పుట్టినరోజు సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేయబోతున్నాడు.

హైదరాబాద్ లో సంధ్య కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరగనున్న ఈవెంట్ లో ఉదయం 11 :30 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయనున్నాడు జక్కన్న.. ఈ ఈవెంట్ లో సినిమాకు పనిచేయబోతున్న ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ పేర్లు కూడా ప్రకటించబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ లో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేయబోతున్నాడు మెగాస్టార్.