మరో 3 రోజుల్లో ఆర్ఆర్ఆర్ పై ఫుల్ క్లారిటీ

Monday,March 11,2019 - 11:45 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్లు ఎవరు?
ఈ సినిమా బడ్జెట్ ఎంత?
ఇంతకీ ఈ సినిమా స్టోరీలైన్ ఏంటి?
ఇకపై ఇలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఒక్క 3 రోజులు ఓపిక పడితే చాలు. అన్ని అనుమానాలకు సమాధానాలు దొరికేస్తాయి. అవును.. త్వరలోనే ఈ మెగా మల్టీస్టారర్ కు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు రాజమౌళి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత యూనిట్ అంతా కలిసి కోల్ కతా వెళ్లబోతోంది. నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభంకాకముందే ప్రెస్ మీట్ ఏర్పాటుచేయాలనేది రాజమౌళి ఆలోచన. మీడియాలో రోజురోజుకు పెరిగిపోతున్న రూమర్స్ ను కట్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడట.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. బాహుబలి లాంటి ఎపిక్ మూవీ తర్వాత రాజమౌళి డైరక్ట్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే రూమర్స్ కూడా భారీగా రౌండ్స్ కొడుతున్నాయి.