నాని నా మాట సరిగ్గా వినలేదు – రాజమౌళి

Thursday,February 01,2018 - 01:12 by Z_CLU

నిన్న నాని ‘అ!’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అనుష్క, కీరవాణి, రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ అకేషన్ లో రాజమౌళి నానిని ఉద్దేశించి మాట్లాడాడు. సినిమా ట్రైలర్ తో ఇంప్రెస్ అయిపోయిన రాజమౌళి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ కి కంగ్రాట్స్ చెప్తూనే, నాని కరియర్ గ్రాఫ్ గురించి తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు.

“నాని ఈ మధ్య ఎన్ని హిట్లు కొట్టాడో కూడా మర్చిపోయాను. వరసగా హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొడుతున్నాడో తనకు కూడా గుర్తు లేదేమో. అయితే ఈ మధ్య రిలీజైన ఓ సినిమా తరవాత ‘నాని ఇంకా మంచి సినిమాలు చేయాలి, దీన్ని దాటి ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి’ అని సజెస్ట్ చేస్తూ మెసేజ్ చేస్తాను. దానికి నాని కూడా తప్పకుండా చేస్తాను అంటూ రిప్లై ఇచ్చాడు. తీరా చూస్తే ఈ సినిమాలో చేపలా కనిపించాడు.’  అని నవ్వుతూ చెప్పిన రాజమౌళి, నాని చేపలా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని, సినిమా కంపల్సరీగా హిట్టవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు రాజమౌళి.

కాజల్, నిత్యామీనన్, రెజీనా, ఈశా రెబ్బ తో పాటు శ్రీనివాస్ అవసరాల కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో రవితేజ బోన్సాయ్ మొక్కలా కనిపించబోయే క్యారెక్టర్ కి వాయిస్ ఇచ్చాడు. డిఫెరెంట్ స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవ్వడం గ్యారంటీ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.