చిరంజీవి గారి మొదటి సినిమాలా ఉంది -రాజమౌళి

Tuesday,August 22,2017 - 06:08 by Z_CLU

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నర్సింహా రెడ్డి’ సినిమా మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించాడు రాజమౌళి. తాజాగా హైదరాబాద్ సంధ్య కన్వెన్షన్ లో జరిగిన చిరు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న జక్కన్న మెగా స్టార్ 151 సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపాడు

అనంతరం రాజమౌళి మాట్లాడుతూ “చిరంజీవి గారు నటిస్తున్న 151 సినిమా మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మోషన్ పోస్టర్ ఫెంటాస్టిక్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో వ‌స్తోన్న ఆ మ్యూజిక్… ఆ క‌ల‌ర్స్, మెగాస్టార్ ముఖం చూపించ‌కుండా వెనుక నుంచి డిజైన్ చేసిన ఆ లుక్ అదిరిపోయింది. ఇప్పటి వరకూ ఆయన నటించిన 150 సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా ఒకెత్తు అనిపిస్తుంది. ఈ మోషన్ పోస్టర్ చూసాక చిరంజీవి గారు నటిస్తున్న మొదటి సినిమాలా అనిపిస్తుంది . ఏ సినిమాకైనా టెక్నీషియన్స్ వర్క్ చాలా ఇంపార్టెంట్ బాహుబలి అంత విజయం సాధించడానికి టెక్నీషియన్సే కారణం. ఈ సినిమాకు పని చేయబోతున్న టెక్నీషియన్స్ పేర్లు ఇప్పుడే వింటున్నా… నిజంగా సర్వప్రయిజ్ గా ఫీలయ్యాను.రెహ‌మాన్ మ్యూజిక్, ప‌రుచూరి క‌లం బ‌లంకు తిరుగులేదు.. సురేందర్ రెడ్డి చాలా మంచి టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ మీద చాలా పట్టున్న దర్శకుడు.. కచ్చితంగా ఈ సినిమాను చాలా గొప్పగా తీస్తాడనే నమ్మకం ఉంది.. ఇక నిర్మాతగా రామ్ చరణ్ కి నేను విషెస్ మాత్రమే చెప్తాను ఆశీస్సులు అభిమానులే అందించాలి..” అన్నారు.