రాజమౌళి ‘RRR’ స్టోరీలైన్ ఇదేనా..?

Thursday,December 27,2018 - 12:12 by Z_CLU

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది రాజమౌళి RRR. సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన వైబ్స్, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఫిల్మ్ మేకర్స్ రామ్ చరణ్, NTR లతో సినిమా అన్న ఒక్క విషయం  తప్ప, ప్రతీది సీక్రెట్ గా మెయిన్ టైన్ చేస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా స్టోరీలైన్ ఇదే అంటూ, ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. వాటిలో ఒక స్టోరీ మాత్రం ఏ మాత్రం ‘నో’ అనడానికి వీల్లేకుండా ఉంది.

రామ్ చరణ్, NTR లు ఇద్దరు అన్నాదమ్ములు 1960 లో. మంచి హ్యాప్పీ గోయింగ్ ఫ్యామిలీ. ఇంతలో విలన్ ఎంట్రీ. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఘర్షణ ఏ విషయంలో అన్నది క్లారిటీ లేదు కానీ, మొత్తానికి ఆ విలన్ చేతిలో ఇద్దరన్నాదమ్ములు చనిపోతారు. సినిమాలో హీరోలు చనిపోతే ఎలా..? అందుకేగా పునర్జన్మ కాన్సెప్ట్. వచ్చే జన్మలో మళ్ళీ పుడతారు ఈ అన్నాదమ్ములు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది.

నెక్స్ట్ జన్మలో ఇద్దరు జన్మెత్తినా ఈ సారి అన్నాదమ్ములుగా పుట్టరు. అందునా వెనకటి జన్మలో ఉన్న NTR వ్యక్తిత్వం చెర్రీకి, చెర్రీ వ్యక్తిత్వం NTR కి వస్తుంది. అంటే క్యారెక్టర్ స్వాపింగ్ జరుగుతుంది. ఇక ఈ జన్మలో వాళ్ళిద్దరూ తమ గత జన్మలో జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవడం, ఇద్దరు కలిసి ఆ విలన్ పై పగ సాధించడం లాంటివి సెకండాఫ్ లో క్రూషల్ ఎలిమెంట్స్.

ఈ స్టోరీలో ఎన్ని ఎలిమెంట్స్ ‘RRR’ తో మ్యాచ్ అవుతాయో తెలీదు కానీ, ఈ సీక్వెన్సెస్ లో NTR, రామ్ చరణ్ లను ఇమాజిన్ చేసుకుంటేనే అద్భుతం అనిపిస్తుంది. ఇలా ఇక్కడ ఫ్యాన్స్ ఇమాజిన్ మోడ్ లో ఉంటే, ‘RRR’ టీమ్ మాత్రం రీసెంట్ గా పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించి ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ, కీర్తి సురేష్ ని ఫిక్స్ అయ్యారని టాక్.