వెయిట్ చేయలేక.. ముందే చెప్పేశాడు..

Sunday,October 02,2016 - 03:33 by Z_CLU

బహుబలి ప్రభాస్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్యాంకాక్‌లోని మేడం టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ అవకాశం దక్కించుకున్న తొలి హీరో ప్రభాస్. 2017 మార్చిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. ప్రభాస్‌కు సంబంధించిన ఒక గుడ్‌న్యూస్‌ను ఈనెల 5న వెలువరిస్తానని చెప్పిన రాజమౌళి ఆ విషయాన్ని శనివారమే ప్రకటించారు. ప్రభాస్‌కు ఇలాంటి గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉందని రాజమౌళి చెప్పారు.

prabhas-1

మేడమ్ టుస్సాడ్స్ మెయిన్ మ్యూజియం లండన్ లో ఉంది. అచ్చుగుద్దినట్టు, అత్యంత సహజంగా మనుషుల మైనపు బొమ్మల్ని తయారుచేయడం ఈ మ్యూజియం ప్రత్యేకత. అంతేకాదు… అంతోఇంతో కాస్త పేరున్న వ్యక్తుల బొమ్మలు మాత్రమే వీళ్లు పెడతారు. ఆసియా నుంచి ప్రముఖులు ఎక్కువైపోవడంతో… ప్రత్యేకంగా బ్యాంకాక్ లో ఓ బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు. ఆ బ్రాంచ్ లోనే ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్నారు. అన్నట్టు టుస్సాడ్స్ నుంచి ఓ టెక్నికల్ టీం వచ్చి ప్రభాస్ కొలతలు తీసుకొని మరీ వెళ్లింది.

prabhas-3