అంచనాలు పెంచేస్తున్న జక్కన్న

Tuesday,March 14,2017 - 04:32 by Z_CLU

‘బాహుబలి 2’ రిలీజ్ దగ్గర పడుతుండడంతో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డాడు రాజమౌళి… ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రమోషన్ మొదలు పెట్టి లేటెస్ట్ గా టీజర్ తో సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసిన జక్కన్న ప్రస్తుతం ట్రైలర్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో ప్రస్తుతం ఆ ట్రైలర్ వర్క్ లో బిజీ అయిపోయాడు జక్కన… లేటెస్ట్ గా ఈ ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో కౌంట్ డౌన్స్ స్టార్ట్ చేసేశారు ఫాన్స్.. మరి పార్ట్-1 ట్రైలర్ తో సినిమా పై ఎక్కడ లేని హైప్ తీసుకొచ్చి గ్రాండ్ హిట్ అందుకున్న జక్కన్న ఇప్పుడు పార్ట్-2 తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనీ చూస్తున్నాడు.. ఏదేమైనా ప్రమోషన్ అందు జక్కన్న ప్రమోషన్ వేరయా..