కీలకమైన సెగ్మెంట్ పై జక్కన్న ఫోకస్...

Tuesday,December 13,2016 - 01:00 by Z_CLU

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘బాహుబలి 2’ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి కానుండడంతో… ప్రమోషన్ పై రాజమౌళి ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్టార్స్ తో ఓ ఫోటో షూట్ ప్లాన్ చేసిన జక్కన్న… ఆ స్టిల్స్ తో క్యారెక్టర్స్ కు సంబంధించి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట.

  ఫొటో షూట్ స్టిల్స్ ద్వారా తీసిన ఫస్ట్ లుక్స్ తో ఫేజ్-1 ప్రచారాన్ని ముగించి.. ఆ తర్వాత ఫస్ట్ లుక్ టీజర్స్ విడుదల చేయాలనే ప్లాన్ లో రాజమౌళి ఉన్నాడట. అలా ఫస్ట్ లుక్ స్టిల్స్, టీజర్స్ పూర్తయిన తర్వాత ఆడియో విడుదల చేసి, థియేట్రికల్ ట్రయిలర్ ను లాంచ్ చేయాలనేది జక్కన్న ప్లాన్. ఇవన్నీ ఏఏ తేదీల్లో జరగాలి, ఎన్ని స్టేజెస్ లో జరగాలనే బ్లూప్రింట్ ను జక్కన్న ప్రిపేర్ చేస్తున్నట్టు టాక్.