అలా ఫిక్స్ అయ్యాడు.....

Saturday,February 25,2017 - 12:32 by Z_CLU

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ‘బాహుబలి ది కంక్లూజన్ ‘ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. ఏ హీరోతో చేయబోతున్నాడు.. ప్రెజెంట్ టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు స్టార్స్ లో నెలకొంటున్న ప్రశ్న… ఇప్పటికే ‘బాహుబలి 2’ సినిమాకు సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయిన జక్కన్న ఈ సినిమాను మరో రెండు నెలల్లో థియేటర్స్ లోకి వదలబోతున్నాడు…

ఇప్పటికే ‘బాహుబలి’ దర్శకుడిగా ఇంటర్నేషనల్ గుర్తింపుతో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకున్న రాజమౌళి ప్రెజెంట్ ‘బాహుబలి 2’ రిలీజ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోబోతున్నాడట. సినిమా రిలీజ్ తర్వాత దాదాపు నెల రోజుల పాటు ప్రమోషన్ పై దృష్టి పెట్టబోతున్న జక్కన్న ఈ ప్రమోషన్ తర్వాత ఒక వెకేషన్ టూర్ ప్లాన్ చేసుకుని తిరిగి వచ్చాకె నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించబోతున్నాడట. మరి జక్కన్న బాహుబలి తర్వాత ఎలాంటి సినిమాతో ఎంటర్టైన్ చేస్తాడో.. తెలియాలంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే….