మరో సారి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ?

Sunday,September 24,2017 - 11:06 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మగధీర’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 2009 లో రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందనే వార్త వినిపిస్తుంది.

‘బాహుబలి’తో ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న రాజమౌళి నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయేది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నే అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో వీరిద్దరి కాంబినేషన్ సినిమా హల్చల్ చేస్తుంది.

మొన్నటి వరకూ జక్కన్న లిస్ట్ లో అల్లు అర్జున్ , ఎన్టీఆర్ పేర్లు వినిపించగా ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ లిస్ట్ లో చరణ్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కంఫర్మ్ అని.. కథ కూడా రెడీ అవుతుందనే టాక్ కూడా చక్కర్లు కొడుతుంది. దానికి తగ్గట్లే రాజమౌళి ఈ మధ్య మెగా ఫామిలీతో సాన్నిహిత్యంగా మెలుగుతుండడం, ఇటివలే చిరు తో కలిసి చరణ్ రంగస్థలం సెట్ కి వెళ్ళడంతో ఈ వార్తలో నిజం లేకపోదు అంటున్నాయి సినీ వర్గాలు.