రాజమౌళి నెక్స్ట్ సినిమా NTR తో..?

Monday,May 08,2017 - 06:43 by Z_CLU

బాహుబలి 2 సెట్స్ పై ఉండగానే రాజమౌళి నెక్స్ట్ సినిమా గురించి ఆ మధ్య ఓ రేంజ్ లో డిస్కషన్ జరిగింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ లాంటివేవీ రాకుండానే ఆ సినిమా టైటిల్ ‘గరుడ’ అని, NTR ఆ సినిమాకి హీరో అని, రాజమౌళి ఓ వైపు బాహుబలి షూటింగ్ జరుపుకుంటూనే, ‘గరుడ’ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాడని రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ విషయాన్ని  రాజమౌళి కానీ, NTR కానీ పెద్దగా పట్టించు కోలేదు, స్పందించలేదు. దాంతో ఆ హవా ఆటోమేటిక్ గా తగ్గిపోయింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బాహుబలి 2 రిలీజయింది. ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా హై ఎండ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ, ఇప్పటికే 1000 కోట్లు వసూలు చేసేసింది. ఇంకా అదే పనిగా కౌంట్ పెంచుకునే పనిలోనే ఉంది. ఈ లోపు అప్పుడెప్పుడో రేజ్ అయి సద్దుమణిగిన ‘గరుడ’ టాపిక్ సోషల్ మీడియాలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికీ బాహుబలి 2 ప్రమోషన్స్ లలో బిజీ బిజీగా ఉన్న రాజమౌళి తన నెక్స్ట్ వెంచర్ ఇంకా అనౌన్స్ చేయలేదు.  ఓ లాంగ్ హాలిడే తరవాత కానీ రాజమౌళి తన నెక్స్ట్ వెంచర్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని ఇటీవలే ప్రకటించాడు జక్కన్న . ఈ లోపు ఫ్యాన్స్ మాత్రం జక్కన్న నెక్స్ట్ సినిమా NTR తోనే ఫిక్స్ అని ఫిక్సయిపోయారు. ఇంతకీ రాజమౌళి మైండ్ లో ఏం నడుస్తుందో అఫీషియల్ అనౌన్స్ చేస్తే కానీ క్లారిటీ రాదు.