రాజమౌళి నెక్ట్స్ మూవీ ఫిక్స్?

Friday,May 26,2017 - 11:45 by Z_CLU

దర్శక ధీరుడు రాజమౌళి నెక్ట్స్ సినిమాపై చిన్నపాటి క్లారిటీ వచ్చింది. కథ, హీరో సెట్ అవ్వకపోయినా నిర్మాత ఎవరనే క్లారిటీ వచ్చేసింది. అవును.. డీవీవీ దానయ్య నిర్మాణంలో రాజమౌళి నెక్ట్స్ సినిమా ఉండబోతోంది. బాహుబలి టైమ్ లోనే రాజమౌళి-దానయ్య మధ్య ఓ సినిమా చేసేందుకు ఒప్పందం కుదిరిందట. త్వరలోనే డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవుతుంది.

నెక్ట్స్ సినిమా ఏంటనే విషయంపై రాజమౌళి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు బాహుబలి-2 సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే తండ్రి విజయేంద్రప్రసాద్ తో కథాచర్చలు జరపుతున్నట్టు టాక్. త్వరలోనే ఓ స్టోరీలైన్ ఫిక్స్ చేసి, అధికారికంగా ప్రకటిస్తారట.