క్లారిటీ ఇవ్వబోతున్న రాజమౌళి

Sunday,December 31,2017 - 12:07 by Z_CLU

బాహుబలి -2 తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయబోయే సినిమా ఏమిటా అనే విషయం పై పెద్ద చర్చే నడుస్తుంది. ఇటీవలే ఎన్టీఆర్ – రామ్ చరణ్ తో జక్కన్న దిగిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారడమే కాకుండా ఆల్మోస్ట్ ఈ కాంబోలో సినిమా కంఫర్మ్ అనే న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. అయితే ఈ విషయంపై రాజమౌళి మళ్ళీ ఎక్కడ ప్రస్తావించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తన నెక్స్ట్ సినిమాకు సంబందించి వచ్చే ఏడాది జనవరి లో ఒక అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది.

లేటెస్ట్ గా తన తండ్రి చెప్పిన ఒక పాయింట్ రాజమౌళి కి బాగా నచ్చిందని, ప్రస్తుతం ఆ కథకి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో హీరో ఎవరన్నది కూడా ఈ అనౌన్స్ మెంట్ ద్వారానే తెలియజేయబోతున్నాడట జక్కన్న.