రాజమౌళి కొత్త సినిమా పోస్ట్ పోన్..?

Wednesday,August 29,2018 - 11:09 by Z_CLU

అనుకున్న ప్లాన్ ప్రకారం అక్టోబర్ లో సెట్స్ పైకి వచ్చేయాలి రాజమౌళి కొత్త సినిమా. దీనికోసం అల్యూనిమియం ఫ్యాక్టరీ లో భారీ సెట్ కూడా నిర్మిస్తున్నారు ఫిలిమ్ మేకర్స్. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా టైమ్ పట్టొచ్చనే టాక్ లేటెస్ట్ గా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. మరో వైపు NTR, రామ్ చరణ్ వారి వారి సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. రాజమౌళి టీమ్ ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ కల్లా బిగిన్ అవ్వాలి. కానీ ఈ సినిమా మ్యాగ్జిమం జనవరి 2019 లో సెట్స్ పైకి వస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయినప్పటి నుండి ఈ సినిమా చుట్టూ భారీ క్యూరియాసిటీ క్రియేట్ అయి ఉంది. దానికి తోడు ఈ సినిమా సెట్స్ పైకి రావడం లేటవుతుందనే న్యూస్, ఫ్యాన్స్ లో మరిన్ని స్పెక్యులేషన్స్ ని రేజ్ చేస్తుంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.