మంచి అకేషన్ కోసం చూస్తున్న జక్కన్న

Friday,June 12,2020 - 11:30 by Z_CLU

RRR సినిమా మొదలైనప్పటినుండే అటు తారక్ ఫ్యాన్స్, ఇటు చరణ్ ఫ్యాన్స్ సినిమా ఫస్ట్ లుక్స్, టీజర్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అయితే ఇటివలే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ , టీజర్ తో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరిపోయింది. కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడే టీజర్ రిలీజ్ అయ్యేది. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో టీజర్ ను కట్ చేసే అవకాశం లేకపోవడంతో మేకర్స్ చేతులెత్తేసారు. అయితే త్వరలోనే తారక్ టీజర్ ఉంటుందని మాటిచ్చాడు జక్కన్న.

ఇప్పుడు షూటింగ్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు తారక్ టీజర్ వదుల్తారా  అంటూ ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి జక్కన్న అండ్ టీం ఫ్యాన్స్ ను ఎక్కువ వెయిట్ చేయించకుండా త్వరగా టీజర్ కట్ ఫినిష్ చేసి రిలీజ్ చేస్తే రెండేళ్ళ గ్యాప్ ను ఇట్టే మరిచిపోయి సంబరాలు జరుపుకునేందుకు సిద్దంగా ఉన్నారు అభిమానులు.

జక్కన్న మాత్రం టీజర్ ను రిలీజ్ చేయడానికి ఓ మంచి సందర్భం కోసం ఎదురుచూస్తున్నాడు.