రాజమౌళి రివీల్ చేయబోతున్నదేంటి...?

Tuesday,March 12,2019 - 03:28 by Z_CLU

ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా ‘RRR’ ని సెట్స్ పైకి తీసుకువచ్చిన రాజమౌళి ఈ నెల 13 న లేదా 14 తేదీల్లో ప్రెస్ మీట్ పెట్టి సినిమాకి సంబంధించిన డీటేల్స్ రివీల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. స్క్రిప్ట్ దగ్గరి నుండి ప్రమోషన్స్ వరకు పక్కా ప్లానింగ్ తో ఉండే జక్కన్న, ఈ ప్రెస్ మీట్ లో ఏం రివీల్ చేయబోతున్నాడు.

గతంలో సినిమా సెట్స్ పై ఉండగానే స్టోరీ దగ్గరి నుండి ప్రతీది రివీల్ చేశాడంటే అది నథింగ్ బట్ ప్రమోషనల్ స్ట్రాటజీనే. ఈ సారి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రెండేసి షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోవడం, ఆ తరవాతే ప్రెస్ మీట్ అని డిసైడ్ అవడం కూడా రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీనే. అందుకే ప్రతీది ప్లాన్ ప్రకారమే చేసే జక్కన్న, RRR కి సంబంధించి జరగబోతున్న ఈ ఫస్ట్ ఎవర్ ప్రెస్ మీట్ లో ఏయే అంశాలపై క్లారిటీ ఇవ్వబోతున్నాడనే క్యూరియాసిటీ ఎక్కడ చూసినా కనిపిస్తుంది.

ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ అని వినిపిస్తుంది. ఇంకో హీరోయిన్ గా నిన్నా, మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేరు వినిపించినా, సడెన్ గా ఈ స్పేస్ లో ఫారిన్ అమ్మాయి అనే టాక్ నడుస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని RFC లో, సెకండ్ షెడ్యూల్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో కంప్లీట్ చేసుకున్న జక్కన్న, 3 వ షెడ్యూల్ ని నిజంగానే కోల్ కతా లో ప్లాన్ చేసుకుంటున్నాడు అని తెలుస్తుంది. అది నిజమేనా..? ఈ విషయంపై క్లారిటీ ఇస్తాడా లేదా..? చూడాలి.

ప్రతి సినిమాకి స్టోరీ చెప్పేస్తాడుగా..? మరి ఈ సారి కూడా చెప్తాడా..? చాన్సెస్ తక్కువే అనిపిస్తున్నా, చెప్పేస్తే బావుండు అనే ఆరాటమైతే ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. ఇదొకటేనా..? రాజమౌళి ఎలాగూ సినిమాకి తనకు కావాల్సినంత టైమ్ తీసుకుంటాడు, తీసుకుంటే తీసుకున్నాడు గానీ, రిలీజ్ డేట్ ఒకటి చెప్పేస్తే డేట్ లాక్ చేసుకుంటాం అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఎవరేది అనుకున్నా రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీ పుస్తకంలో ఏది రాసుకున్నాడో, దాని ప్రకారమే అప్డేట్ చేస్తాడు, ఇది ఫిక్స్.