క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Saturday,October 01,2016 - 10:00 by Z_CLU

నిజంగానే జక్కన్నకు ఇప్పుడు దారి తెలియడం లేదు. అంటే.. దారిలేదని కాదు.. ఎన్నో దారులున్నాయి. వాటిలోంచి ఓ మార్గాన్ని సెలక్ట్ చేసుకోవడం రాజమౌళికి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడనే చర్చ పెద్ద రచ్చకు దారితీస్తోంది.

భారీ విజయం తర్వాత అంచనాలు తగ్గించేందుకు ఓ చిన్న సినిమా చేయడం రాజమౌళికి అలవాటు. మగధీర తర్వాత అదేపనిచేశాడు. చరిత్ర సృష్టించిన ఆ మూవీ తర్వాత సునీల్ తో మర్యాదరామన్న సినిమా చేశాడు. అంచనాలు పెంచకుండా ఉండేందుకు మొదటి రోజే కథ మొత్తం చెప్పేశాడు. సో..ఈసారి బాహుబలి-2 తర్వాత అదే టైపులో మరో లో-ప్రొఫైల్ మూవీ చేయొచ్చని ఓ సెక్షన్ వాదిస్తోంది.

 

మరోవైపు బాహుబలి తర్వాత.. అంతకుమించిన మరో భారీ బడ్జెట్ సినిమాతో రాజమౌళి సెట్స్ పైకి వస్తాడని మరికొందరు వాదిస్తున్నారు. టోటల్ సౌత్, నార్త్ కు చెందిన స్టార్ కాస్ట్ తో గరుడ అనే ప్రాజెక్టును పట్టాలపైకి తెస్తాడని ఈ గ్రూప్ వాదిస్తోంది. ఈ గ్రూపుల లొల్లి ఎలా ఉన్నప్పటికీ.. కొందరు స్టార్ హీరోలు మాత్రం రాజమౌళితో సినిమా చేసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ తాజా  రాజమౌళి తన తదుపరి సినిమా పై క్లారిటీ ఇచ్చేసాడు. ‘బాహుబలి-2 తరువాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తానని చెప్పాడు. మరి జక్కన్న నెక్స్ట్ ఏ తరహా సినిమా చేస్తాడో? తెలియాలంటే బాహుబలి విడుదల అయ్యాక కొన్ని నెలలు ఆగాల్సిందే..