బాహుబలి బాటలో రాజమౌళి

Friday,March 02,2018 - 03:55 by Z_CLU

సినిమా ఎనౌన్స్ చేసి, కొబ్బరికాయ కొట్టి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ప్రతి సినిమాకు జరిగే ప్రాసెస్ ఇది. కానీ రాజమౌళి సినిమాలకు మాత్రం వీటితో పాటు మరో ఎక్స్ ట్రా యాక్టివిటీ కూడా ఉంటుంది. అదే రిహార్సల్. అవును.. తన ప్రతి సినిమాకు కీలకమైన నటీనటులతో రిహార్సల్స్ చేయిస్తాడు రాజమౌళి. బాహుబలి సినిమాకు అదే పనిచేశాడు. చరణ్, ఎన్టీఆర్ కాంబోలో త్వరలోనే స్టార్ట్ చేయబోతున్న సినిమాకు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వబోతున్నాడు.

అవును.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రిహార్సల్స్ ప్రారంభించబోతున్నాడు జక్కన్న. దీనికి ప్రీ-విజువలైజేషన్ అనే పేరుపెట్టారు. ఈ ప్రొగ్రామ్ జులై నుంచి స్టార్ట్ అయి, నెల రోజుల పాటు కొనసాగుతుంది. రిహార్సల్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆగస్ట్ నుంచి మూవీ సెట్స్ పైకి వస్తుంది.

ఈ మల్టీస్టారర్ మూవీలో రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాల్ని వీలైనంత తొందరగా పూర్తిచేసి, రాజమౌళితో కలిసి మల్టీస్టారర్ మూవీని స్టార్ట్ చేస్తారు.