ఎన్టీఆర్ తోనే ఫిక్స్ ?

Sunday,June 25,2017 - 02:20 by Z_CLU

‘బాహుబలి’ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రాజమౌళి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడా..ఏ హీరో ని డైరెక్ట్ చేస్తాడా..అనే క్యూరియాసిటీ రోజు రోజుకి ఎక్కువైవుతుంది. అయితే లేటెస్ట్ గా రాజమౌళి నెక్స్ట్ సినిమా డి.వి.వి.ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో దానయ్య నిర్మాతగా ఉంటుందనే టాక్ వినిపించింది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఈ కాంబో లో సినిమా ఫిక్స్ అన్నది ఇండస్ట్రీ టాక్.

లేటెస్ట్ సమాచారం ప్రకారం జక్కన్న నెక్స్ట్ఓ సీరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించబోతున్నాడని, ‘బాహుబలి’ తో దర్శకుడిగా వచ్చిన క్రేజ్ కి ఈ సినిమా ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందని టాక్. ఇప్పటికే తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో రాజమౌళి ఈ సినిమా కోసం ఓ కథను సిద్ధం చేయిస్తున్నాడని, ఈ సీరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఎన్టీఆర్ తోనే రూపొందించడానికి రెడీ అవుతున్నాడని, త్వరలోనే తారక్ కి కథ కూడా చెప్పబోతున్నాడని సమాచారం. సో ఈ వార్త గాని నిజమైతే అటు త్రివిక్రమ్ ఇటు రాజమౌళి సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతాడు తారక్.