బార్డర్ క్రాస్ చేసిన రాజమౌళి

Friday,March 15,2019 - 10:44 by Z_CLU

‘మగధీర’ తరవాతే రాజమౌళిని హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో కంపేర్ చేయడం స్టార్ట్ అయింది. ఎన్నాళ్ళకైనా రాజమౌళి హాలీవుడ్ కి వెళ్ళడం గ్యారంటీ అన్నారు. ‘బాహుబలి’ తో బాలీవుడ్ లో మార్క్ క్రియేట్ చేసుకున్న జక్కన్న, RRR లో దేసీ ఎడ్గార్ జోన్స్ ని ఎంచుకుని ఈ సారి ఇండియన్ సినిమా బార్డర్ ని కూడా క్రాస్ చేసేశాడు. దీంతో ఈ దర్శక ధీరుడి విజన్ మరింత క్లియర్ గా కనిపిస్తుంది.

లెక్కప్రకారం బిగినింగ్ లో టాలీవుడ్ స్థాయిలో నిరూపించుకోవాలి, ఇక్కడ కొద్దో గొప్పో నిరూపించుకున్నాక వైడ్ మార్కెట్ కాబట్టి, బాలీవుడ్ ని టార్గెట్ చేసుకోవాలి.. అక్కడ కూడా అదే స్థాయి సక్సెస్ అందుకున్నామంటే చాలు.. ఆ మార్క్ ని కాపాడుకునేలా ఫ్యూచర్ సినిమాలు చేసుకోవాలి.. ఇది నార్మల్ గా ఫిల్మ్ మేకర్స్ పాటించే ఆనవాయితీ. కానీ రాజమౌళి ఎజెండానే వేరు…

బాహుబలితో బాలీవుడ్ లో స్టాంప్ వేసుకున్నాడు. ఈ RRR తో ఈ సారి హాలీవుడ్ లో కూడా అదే స్థాయి స్టాంప్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. NTR హీరోయిన్ కాబట్టి ఇప్పటి వరకు జస్ట్ దేసీ ఎడ్గార్ జోన్స్ మాత్రమే మన  ఫోకస్ లోకి వచ్చింది. కానీ సినిమాలో తక్కిన బ్రిటిషర్స్ రోల్స్ కోసం, హాలీవుడ్ లో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన స్టార్స్ ని ప్రిఫర్ చేసే అవకాశాలు బోలెడు కనిపిస్తున్నాయి. అంచనా కరెక్టయితే ఈ అవకాశాన్ని 100% వాడుకుంటాడు జక్కన్న.

తన సినిమాల మార్కెట్ ఈ స్థాయిలో పెంచుకుంటూ పోతున్న జక్కన్న, తనతో పాటు టాలీవుడ్ స్థాయిని కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు. హాలీవుడ్ కి రాజమౌళి వెళ్తాడనుకుంటే, ఏకంగా  టాలీవుడ్ నే  తీసుకెళ్తున్నాడు. గమనిస్తే ‘RRR’ టైటిల్ కూడా ఇంగ్లీష్ అక్షరాలే మరీ. ఏంటో ఇలా  ఫిక్సవుతాడో  లేదో అలా అన్నీ కలిసొచ్చేస్తాయి జక్కన్నకి.