బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్న రాజమౌళి

Wednesday,June 05,2019 - 11:03 by Z_CLU

బాహుబాలి కోసం మాహిష్మతి రాజ్యాన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు కొమురం భీమ్ కోసం ట్రైన్డ్ బ్రిటీష్ సైన్యాన్ని సిద్ధం చేశాడు. ఎన్నాళ్ళ పాటు ఈ ప్రిపరేషన్స్ చేశాడో తెలీదు కానీ.. సినిమాలో భారీ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తుంది రాజమౌళి అండ్ టీమ్.

రాజమౌళి సినిమాలో హీరో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో, విలన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాడు.. అందునా ‘RRR’ లో ఇద్దరు స్టార్ హీరోలు… అందుకే దానికి ధీటుగా ఈ సినిమాలో కీ ఎలిమెంట్ గా నిలవనున్న బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అంతే గ్రాండ్ గా స్థాపిస్తున్నాడు రాజమౌళి.

సాధారణంగా సినిమాలోని కొన్ని భారీ సీక్వెన్సెస్ ల కోసం ఫారిన్ లొకేషన్స్ ని ప్రిఫర్ చేస్తుంటారు ఫిలిమ్ మేకర్స్. కానీ రాజమౌళి ఇలాంటి ఆచారానికి కొంచెం దూరంగానే ఉంటాడు. మ్యాగ్జిమం తన విజన్ కి తగ్గట్టు భారీ సెట్స్ వేసి ఆ గ్రాండియర్ ఎక్స్ పీరియన్స్ ని కళ్ళకు కడతాడు.

అందుకే ప్రస్తుతం జస్ట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ సీక్వెన్సెస్ పై ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తుంది. చూడాలి బాహుబలి స్థాయిలో ‘RRR’ లో ఇంకెన్ని సర్ ప్రైజెస్ ప్లాన్ చేశాడో రాజమౌళి.