RRR Movie - భారీగా ప్లాన్ చేసిన రాజమౌళి

Friday,March 18,2022 - 04:01 by Z_CLU

Rajamouli Big Promotional plans about RRR Movie

RRR ఈ ఏడాది జనవరి 7న రిలీజ్ అవ్వాల్సింది. కానీ కోవిడ్ కారణంగా సినిమా రిలీజ్ వరకూ వచ్చి వాయిదా పడింది. ఆ టైంలో జనవరి 7న రిలీజ్ అంటూ ఓ రేంజ్ లో ప్రమోషన్ చేశాడు జక్కన్న. అందుకోసం భారీగా ఖర్చు చేశారు కూడా. కానీ సినిమా మళ్ళీ వాయిదా పడటంతో ఆ ఖర్చు అంతా వృదా అయింది. అయితే ఇప్పుడు రాజమౌళి కొత్త రిలీజ్ డేట్ తో సినిమాను మళ్ళీ ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తాడు ? పది రోజుల్లో భారీ హైప్ క్రియేట్ చేయడం సాధ్యమేనా ? అనుకున్నారు అంతా. కానీ అక్కడ ఉన్నది రాజమౌళి. జస్ట్ వారం రోజుల్లోనే మళ్ళీ సినిమాపై బజ్ క్రియేట్ చేసి ఎక్కడ చూసిన RRR గురించే మాట్లాడుకునేలా చేశాడు.

హీరోలిద్దరినీ బయటికి తీసుకొచ్చి క్షణం తీరిక లేకుండా ఇంటర్వ్యూలు చేయిస్తున్నాడు. మరో పక్క దాదాపు పది లోకేషన్స్ లో ఈవెంట్స్ ప్లాన్ చేశాడు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ లో రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి మీడియాతో ముచ్చటించారు అక్కడి ప్రమోషన్ స్టార్ట్ అయింది. అదే రోజు కోలీవుడ్ మీడియాకి కూడా ఓ కామన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆరోజంతా హోటల్ బుక్ చేసుకొని మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు.

ఆ తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడి తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయించారు. ఆ ఇంటర్వ్యూ బాగా క్లిక్ అయింది. ఇక ఈరోజు నుండి గట్టిగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ముందుగా దుబాయ్ లో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇవ్వాళ సాయంత్రం దుబాయ్ లో ఈవెంట్ చేసుకొచ్చి రేపు కర్ణాటకలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు టీం. అక్కడి నుండి బరోడా , డిల్లీ, అమ్రిత్ సర్ , జైపూర్ , కోల్ కత్తా, వారణాసి ,హైదరాబాద్ ఇలా వరుసగా డిఫరెంట్ లోకేషన్స్ లో ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల 23 వరకూ ఎన్టీఆర్ , రామ్ చరణ్ వరుసగా ప్రమోషన్స్ పాల్గొంటారు. ఆరోజు హైదరాబాద్ లో జరగనున్న ఈవెంట్ తో ప్రమోషన్ ప్లాన్ ముగుస్తుంది.

మరి రిలీజ్ కి ముందు రెండ్రోజులు కూడా ఏవో గట్టి ప్రమోషన్స్ ప్లాన్ చేశాడట జక్కన్న. ఏదేమైనా రాజమౌళి సినిమాకి ఎంత కష్టపడతాడో అంతే కష్టం ప్రమోషన్స్ కి కూడా పడతాడు హీరోలని పెడతాడు. అందుకే మార్కెటింగ్ స్టాటజీ లో రాజమౌళి అగ్ర స్థానంలో ఉంటాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics