'అరవింద'ను ఆకాశానికెత్తేసిన జక్కన్న

Saturday,October 13,2018 - 09:02 by Z_CLU

ఓ మంచి సినిమా వస్తే ట్వీట్ చేయకుండా ఉండలేదు రాజమౌళి. ఈసారి కూడా అదే పనిచేశాడు. సూపర్ హిట్టయిన అరవింద సమేత అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.

https://twitter.com/ssrajamouli/status/1050728006283653120

యుద్ధం అనేది ఏ సినిమాలోనైనా క్లైమాక్స్ లో వస్తుంది. అదే యుద్ధంతో సినిమా మొదలుపెట్టి కొనసాగించడం చాలా కొత్త. పైగా చాలా కష్టం కూడా. అలాంటి కథను ఎంచుకొని త్రివిక్రమ్, యంగ్ టైగర్ కలిసి అద్భుతమైన విజయం సాధించారని మెచ్చుకున్నాడు జక్కన్న. తారక్ పెర్ఫార్మెన్స్ చాన్నాళ్ల పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని అన్నాడు.

అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా రాజమౌళి డైరక్షన్ లోనే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆ మల్టీస్టారర్ రాబోతోంది. ప్రస్తుతం ‘అరవింద’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. త్వరలోనే రాజమౌళితో కలిసి వర్క్ షాప్ ప్రారంభిస్తాడు.