ఈ రోజు నుండే రవితేజ 'రాజా ది గ్రేట్' హంగామా షురూ

Monday,September 18,2017 - 11:22 by Z_CLU

రవితేజ ‘రాజా ది గ్రేట్” ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. రవితేజ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ అంధుడిలా నటిస్తుండటం, దానికి తోడు గ్యాప్ తీసుకుని మరీ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ప్రస్తుతం వైజాగ్ లో హై ఇంటెన్స్ ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే పనిలో ఉన్న సినిమా యూనిట్, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేయనుంది. ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 12 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.