'రాజా ది గ్రేట్' షూటింగ్ అప్ డేట్స్

Sunday,September 03,2017 - 01:06 by Z_CLU

రవితేజ హీరోగా నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘రాజా ది గ్రేట్’. లేటెస్ట్ గా ‘సుప్రీమ్’ తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం అంధుడిగా కనిపించబోతున్నాడు మాస్ మహారాజ్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 15 వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ తో రెండు 3 పాటల మినహా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం.

ఇటీవలే టీజర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాలో
రవితేజ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజి కి చేరుకున్న ఈ సినిమాను అక్టోబర్ 12 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..