Raja Raja Chora - హిలేరియస్ టీజర్

Friday,June 18,2021 - 02:22 by Z_CLU

తన బాడీ లాంగ్వేజ్, మైండ్ సెట్ కు సూట్ అయ్యే సెన్సిబుల్ కథల్ని సెలక్ట్ చేసుకోవడంలో హీరో శ్రీవిష్ణు పండిపోయాడు. ప్రతి సినిమాకు ఓ కొత్త పాత్రను సెలక్ట్ చేసుకునే ఈ నటుడు.. ఈసారి సాఫ్ట్ (వేర్) దొంగ అవతారం ఎత్తాడు. ఆ సినిమానే రాజరాజ చోర. ఈరోజు రిలీజైన ఈ సినిమా టీజర్ హిలేరియస్ గా ఉంది.

రాజరాజ చోర సినిమాకు సంబంధించి చోర గాధ పేరిట రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ గతంలోనే ఓ వీడియో రిలీజ్ చేశారు. సినిమా హిలేరియస్ గా ఉంటుందనే విషయాన్ని ఆ వీడియోతోనే చెప్పారు. ఇప్పుడు ఆ అంచనాల్ని రెట్టింపు చేసేలా రాజ రాజ చోర టీజర్ రిలీజైంది. సినిమాలో కామెడీ పుష్కలంగా ఉండబోతోందనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది.

మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. గంగవ్వను కేవలం చోరగాథ వీడియో కోసం మాత్రమే వాడుకున్నారని, వెరైటీగా ఉంటుందని వాయిస్ ఓవర్ చెప్పించారని అంతా అనుకున్నారు. కానీ ఆమె సినిమాలో కూడా ఉంది. మంచి పాత్ర కూడా దక్కించుకున్నట్టుంది. టీజర్ లో ఆమెను చూపించారు.

టీజర్ లో హీరోను పైకి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా చూపించినప్పటికీ, అతడ్ని ఒక స్మార్ట్ దొంగగా ప్రజెంట్ చేశారు. అతడి కోసం వెదికే పోలీసాఫీసర్ గా రవి బాబు కనిపిస్తున్నాడు. ఇక హీరో ప్రేయసి పాత్రలో మరో ముఖ్యమైన పాత్రలో మేఘ ఆకాష్ కనిపించింది. ఇలా తక్కువ పాత్రలే కనిపిస్తున్నప్పటికీ, కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా నడిపించినట్టున్నాడు దర్శకుడు హసిత్ గోలి.

raja raja chora sree vishnu

బ్రోచేవారెవరురా అనే సూపర్ హిట్ సినిమాకు దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి పనిచేశాడు హసిత్ గోలి. ఇప్పుడు అతడు దర్శకుడిగా మారి తీసిన రాజ రాజ చోర టీజర్ లో కూడా బ్రోచేవారెవరురా ఫ్లేవర్ కనిపిస్తోంది. సో.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టీజీ
విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కంబైన్డ్ గా నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics