రాజా నరసింహా స్టోరీ లైన్ ఇదే!

Tuesday,November 19,2019 - 12:19 by Z_CLU

అదొక మారుమూల అటవీ ప్రాంతం. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందుతాగి అక్కడ 75 మంది చనిపోయారు. ఆ సమస్యను తీర్చగలిగే ఏకైక వ్యక్తి నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా! ఆతను చెప్పిందే చేస్తాడు.. చేసేది మాత్రమే చెప్తాడు! జనాల్ని మోసం చేసే సాధారణ వ్యక్తినైనా, మంత్రినైనా బట్టలు లేకుండా జనాల్లో నిలబెట్టే సత్తా ఉన్నవాడు. నమ్మి తన వెంట వచ్చినవాళ్లను ప్రాణం ఇచ్చి అయినా కాపాడతాడు. ఆ అటవీ ప్రాంతంలో సమస్యను రాజా ఎలా పరిష్కరించాడు అన్నదే రాజా నరసింహా సినిమా.

రాజా చెప్పిందే చేస్తాడు.. చేసేది మాత్రమే చెప్తాడు అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇలా ముందుగానే స్టోరీలైన్ ను బయటపెట్టారు మేకర్స్. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ వంద కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది. తెలుగులో కూడా అదే మేజిక్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు.

మాస్-కమర్షియల్ ఎఁటర్ టైనర్స్ ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు రాజా నరసింహాను కచ్చితంగా ఆదరిస్తారని యూనిట్ చెబుతోంది. పైగా తెలుగులో కూడా హిట్ అయిన మన్యంపులి సినిమాకు దర్శకత్వం వహించిన వైశాఖ్ ఈ సినిమాకు దర్శకుడు కావడం మరో ప్లస్ పాయింట్. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాడు రాజా నరసింహా.