రాజా గౌతమ్ ఇంటర్వ్యూ

Wednesday,September 05,2018 - 02:10 by Z_CLU

రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘మను’ ఈ నెల 7 న గ్రాండ్ గా రిలీజవుతుంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డిఫెరెంట్ స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయి ఉంది. ఈ సినిమా గురించి కొంచెం రివీల్ చేసినా, సినిమాలో థ్రిల్ మిస్సవుతుందని చెప్తున్న హీరో రాజా గౌతమ్, ఈ సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడిందో మీడియాతో చెప్పుకున్నాడు అవి మీకోసం…

అలా జరిగింది…

ఫణి చేసిన షార్ట్ ఫిలిమ్ చూసి నార్మల్ గా కలిశాను ఒకసారి. అపుడు తన దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పుకొచ్చాడు. అప్పుడు చెప్పిన స్టోరీనే ఈ మను…

నేననుకోలేదు…

ఫణి స్టోరీ చెప్తున్నప్పుడు కూడా ఈ సినిమా నేను చేస్తానని నేననుకోలేదు. ఫణి కూడా అప్పటి వరకు ఈ సినిమా నాతో చేయాలనే ఆలోచనలో లేడు…

మూడున్నరేళ్ళ కృషి…

ఈ స్టోరీ పై మూడున్నరేళ్ళు పని చేశాం. ఇలాంటి సినిమా చేయాలంటే డబ్బుల కన్నా ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి. అందుకే కథలో ప్రతి పాయింట్ ని పక్కాగా ఎస్టాబ్లిష్ అయ్యేలా చేశాం. ఈ సినిమా సక్సెస్ అయితే మరిన్ని కొత్త కాన్సెప్ట్స్, మరింత మంది కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేసినట్టే…

వెదుక్కుంటే దొరికింది…

నాకు వచ్చిన గ్యాప్ లో చాలా కథలు విన్నా… అద్భుతం అనిపించిన స్టోరీస్ కూడా వదులుకున్నా… మనసులో ఒకటే తపన ది బెస్ట్ సినిమా చేయాలి. దానికోసం ఇన్నాళ్ళుగా వెదుక్కుంటే ‘మను’ దొరికింది.

కష్టమనిపించలేదు…

ఈ సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్నా ఏ మాత్రం కష్టపనిపించలేదు. ఏమైనా మంచి సినిమా చేద్దామని  థియేటర్ కి వచ్చిన ఆడియెన్స్ ని 100% ఎంటర్ టైన్ చేయాలి. వాళ్ళను డిజప్పాయింట్ చేయకూడదు అనే ఒక ఆలోచన ఉండేది.

4 రోజుల్లో కోటి రూపాయలు…

చాలా మంది ప్రొడ్యూసర్స్ కలిశాం. అందరూ సినిమా మరీ ఎక్స్ పెరిమెంటల్ గా ఉందని అడుగు వెనక్కి వేశారు. ఇంకా అప్పుడు ఫణి, క్రౌడ్ ఫండింగ్ అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. అంతే.. 4 రోజుల్లో కోటి రూపాయలు వచ్చాయి.

అదొక్కటే ఆలోచన…

ఏ సినిమా చేసినా యాక్టర్ గా నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి అదొక్కటే ఆలోచన. నాకు పర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ దొరకాలి కానీ ఎలాంటి సినిమా అయినా చేసేస్తా. హీరోగానే చేయాలి అని అనుకోవట్లేదు.

నాన్న చెప్పాడు…

నాన్న ఒక్కటే చెప్పాడు.. ఏ సినిమా చేసినా కంప్లీట్ గా నిన్ను నువ్వు 100% పెట్టాలి. ఈ సినిమాకు అదే చేశాను. అంతకు మించి ఈ సినిమా స్టోరీలో కానీ ప్రాసెసింగ్ లో ఇన్వాల్వ్ కాలేదు.

జస్ట్ కోటి రూపాయల సినిమా కాదు…

‘మను’ సినిమాను టెక్నికల్ గా అబ్జర్వ్ చేస్తే ఇది కోటి రూపాయల్లో అయ్యే సినిమా కాదు… సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ స్క్రిప్ట్ ని ఇష్టపడి, పర్సనల్ గా సినిమాలో ఇన్వాల్వ్ చేశాడు. అందుకే ఇది టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ సినిమా…

నెక్స్ట్ సినిమాలు…

ప్రస్తుతానికి 2 నచ్చిన కథలున్నాయి కానీ ‘మను’ రెస్పాన్స్ తరవాత డిసైడ్ అవుదామని ఫిక్సయ్యా.