నారా రోహిత్ కెరీర్ లో డిఫరెంట్ మూవీ

Friday,December 15,2017 - 05:26 by Z_CLU

విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ నారా రోహిత్. ఈ హీరో నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా అది కొత్తగా ఉంటుంది. గతంలో ఈ హీరో నటించిన “రాజా చెయ్యి వేస్తే” సినిమా కూడా అలాంటిదే. ఈ వెరీ వెరీ స్పెషల్ మూవీని నారా రోహిత్ ఒప్పుకోవడానికి కారణాలేంటి? జీ సినిమాలు ఛానెల్ లో ఈరోజు రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కానున్న రాజా చెయ్యి వేస్తే సినిమా హైలెట్స్ ఏంటో చూద్దాం.

ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ : నారా రోహిత్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఆ స్టోరీలైన్ కచ్చితంగా కొత్తగా ఉందని అర్థం. రాజా చెయ్యి వేస్తే మూవీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకునే ఒక వ్యక్తికి, కరడుగట్టిన క్రిమినల్ కి మధ్య ఉండే రిలేషన్ షిప్, అతను రాసుకున్న కథకి విలన్ చంపాలనుకునే వ్యక్తికి మధ్య ఉండే సంబంధం ఏమిటనేది ఈ సినిమాలో కీ ఎలిమెంట్.

థ్రిల్లింగ్ ఎలిమెంట్ : సినిమా బిగినింగ్ లోనే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ తో స్టార్ట్ అయ్యే ఈ సినిమా, ఎండింగ్ వరకు అదే టెంపోని మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా హీరో నారా రోహిత్, విలన్ తారకరత్న మధ్య నడిచే మైండ్ గేమ్ తో పాటు సెకండాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి.

కామెడీ ఎలిమెంట్స్ : సినిమా ఎంత సీరియస్ గా ఉన్నప్పటికీ మధ్యమధ్యలో వచ్చే కామెడీ పంచ్ లు రీఫ్రెష్ అనిపిస్తాయి. స్టోరీ నెరేషన్ ను దెబ్బతీయకుండా వైవా హర్ష పండించిన కామెడీ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

సాంగ్స్ : సాయి కార్తీక్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఆడియో రిలీజ్ తరవాత కన్నా సినిమా రిలీజ్ అయ్యాకే మరింత పాప్యులర్ అయ్యాయి. సందర్భానుసారంగా ఉండే ప్రతి పాట, ఏదో ఇరికించినట్టు కాకుండా కథలో కలిసిపోతుంది.

యాక్షన్ ఎలిమెంట్స్ : సినిమాలోని ప్రతి ఎలిమెంట్ స్టోరీలో సింక్ అయ్యేలా కేర్ తీసుకున్న డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి యాక్షన్ ఎలిమెంట్స్ విషయంలో అదే ఫార్ములా ఫాలో అయ్యాడు.

రొటీన్ కు కాస్త భిన్నంగా ఉండే సినిమాలు కోరుకునే ప్రతి ఒక్కరు రాజా చెయ్యి వేస్తే సినిమా చూడాల్సిందే. డోంట్ మిస్ ఇట్…