Stundup Rahul - టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన రాజ్ తరుణ్

Friday,July 09,2021 - 08:01 by Z_CLU

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్టాండప్ రాహుల్’ సినిమా నుండి టీజర్ రిలీజ్ విడుదలైంది. ఈ టీజర్ ని దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు. స్టాండప్ కామెడీ నేపథ్యంతో ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. 1 నిమిషం 24 సెకన్లతో కట్ చేసిన టీజర్ లో రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషణ్ అందులో ఉండే ఫన్ తెలియజేసేలా ఉన్నాయి. అలాగే టీజర్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ రోల్ కూడా రివీల్ చేశారు డైరెక్టర్.

సినిమాలో కామెడీతో పాటు మంచి ఎమోషన్ ఉందని చెప్పేలా ఇంద్రజ క్యారెక్టర్ తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని టీజర్ చూస్తే అర్థమైపోతుంది. సినిమాలో డైరెక్టర్ వెంకటేష్ మహా గెస్ట్ రోల్ చేశారని టీజర్ లో చూపించేశారు. ఫైనల్ గా స్టాండప్ కామెడీ తో సరదాగా సాగుతూనే లవ్ స్టోరి, ఫ్యామిలీ ఎమోషన్స్ , ట్విస్టులు ఇలా అన్ని సినిమాలో మిక్సయి ఉన్నాయని టీజర్ తో క్లియర్ కట్ చెప్పారు మేకర్స్. ఫైనల్ గా టీజర్ లో రాజ్ తరుణ్ సింగిల్ లైఫ్ గురించి చెప్పిన డైలాగ్ , మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచి టీజర్ తో అంచనాలు పెంచాయి.

stand up rahul movie stills 1

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. నంద కుమార్ , భరత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు స్వీకర్ అగస్తి మ్యూజిక్ అందిస్తున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics