Aha Na Pellanta అంచనాలు పెంచిన టీజర్

Monday,October 31,2022 - 07:03 by Z_CLU

రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ కలిసి OTT ప్రేక్షకుల కోసం ‘అహనా పెళ్ళంట’ అనే   టైటిల్ తో వెబ్ సిరీస్  చేస్తున్నారనే ఎనౌన్స్ మెంట్ నుండే ఈ వెబ్ సిరీస్ పై మోస్తారు అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదలైన టీజర్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచి ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా ? అని ఎదురుచూసేలా చేసింది.

ఇటివల తను పెళ్లాడబోతున్న అమ్మాయి గురించి తన పెళ్లి గురించి ప్రీ టీజర్ ఎనౌన్స్ కోసం ఓ ప్రాంక్ వీడియో పెట్టిన రాజ్ తరుణ్ ‘అహనా పెళ్ళంట‘ టీజర్ తో ఆకట్టుకున్నాడు.  ఇప్పటి నుండి నా పెళ్ళయ్యే వరకు ఏ అమ్మాయి వెంట పడను అంటూ చిన్నతనంలో తన అమ్మకి మాట ఇచ్చి ఆ మాటకి కట్టుబడి పెళ్లి కోసం తహతహలాడే ఓ కుర్రాడి పెళ్లి కథతో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిన ఈ సిరీస్ జీ 5 ప్రేక్షకులను కావలసినంత ఎంటర్టైన్ చేస్తుందనడంలో సందేహం లేదు. ‘కనీ వినీ ఎరుగని గోలంట‘ అనే క్యాప్షన్ తో సిరీస్ అంతా గోల గోలగా ఉండనుందని మేకర్స్ ఈ టీజర్ తో చెప్పకనే చెప్పారు.

టీజర్ లో రాజ్ తరుణ్ కేరెక్టర్ , చైల్డ్ ఎపిసోడ్ , లవ్ ట్రాక్ , కామెడీ ఇలా అన్ని క్లిక్ అయ్యాయి.  ఫ్యామిలీ అంతా కలిసి చూసే సిరీస్ గా అహనా పెళ్ళంట రాబోతుందని అర్థమవుతుంది.  సూర్య రాహుల్ , సాయి దీప్ బొర్రా నిర్మించగా ABCD ఫేమ్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.  దావూద్ షేక్ కథ అందించిన ఈ సిరీస్ కి కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ అందించాడు.

రాజ్ తరుణ్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సిరీస్ తో OTT లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం తనకి పర్ఫెక్ట్ గా సూటయ్యే ఓ ఫన్ స్క్రిప్ట్ ఎంచుకొని థియేటర్స్ లో మెప్పించిట్టే ఈ సిరీస్ తో బుల్లితెరపై కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేయదానికి సిద్దమవుతున్నాడు. శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించిన ఈ సిరీస్ లో ఆమని , హర్ష వర్ధన్ , పోసాని, గెటప్ శ్రీను , మధు నందన్ , రాజ్ కుమార్ , రవి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

నవంబర్ 17న అహనా పెళ్ళంట  ZEE5 స్ట్రీమ్ కానుంది. 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics