యాక్సిడెంట్ పై రాజ్ తరుణ్ రియాక్షన్

Wednesday,August 21,2019 - 12:14 by Z_CLU

నిన్న పొద్దున్న ఔటర్ రింగ్ రోడ్డుపై రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ యాక్సిడెంట్ నుంచి సేఫ్ గా బయటపడ్డాడు రాజ్ తరుణ్. యాక్సిడెంట్ తర్వాత ఎవ్వరికీ అందుబాటులోకి రాని ఈ హీరో, ఎట్టకేలకు రియాక్ట్ అయ్యాడు. తను సేఫ్ గానే ఉన్నానని ప్రకటించాడు.

“మీ అందరి ఆదరాభిమానాలకు థ్యాంక్స్. నేను క్షేమంగా ఉన్నానా లేదా అంటూ కాల్స్ చేసినందుకు థ్యాంక్స్. 3 నెలలుగా నార్సింగ్ సర్కిల్ వద్ద యాక్సిడెంట్స్ కామన్ అయిపోయాయి. సెడన్ గా రైట్ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. నా కారు గోడను కొట్టింది. వెంటనే సహాయం కోసం ఇంటికి వెళ్లిపోయాను”

ఇలా యాక్సిడెంట్ జరిగిన తీరును వివరించాడు రాజ్ తరుణ్. తను క్షేమంగానే ఉన్నానని, త్వరలోనే సినిమా సెట్స్ పైకి వస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ హీరో దిల్ రాజు బ్యానర్ తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు చేస్తున్నాడు.