రాజ్ తరుణ్ అసలు ప్రాబ్లమ్ రివీలయింది

Friday,May 11,2018 - 06:41 by Z_CLU

రాజ్ తరుణ్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ‘రాజుగాడు’ ట్రైలర్ రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 1 న గ్రాండ్ గా రిలీజవుతుంది. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

రాజ్ తరుణ్ ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ట్రైలర్ లో కనిపిస్తున్నదాన్ని బట్టి తనకు తెలియకుండానే దొంగతనం చేసే డిసీజ్ ఉన్న కుర్రాడిలా చాలా న్యాచురల్ గా నటించేశాడు రాజ్ తరుణ్.

‘తనకు తెలీకుండానే దొంగతనం చేసే డిసీజ్’ అనే పాయింట్ చుట్టూ డైరెక్టర్ సంజనా రెడ్డి సినిమాకి కావాల్సినన్నీ హిలేరియస్ ఎలిమెంట్స్ ని అల్లుకుందని తెలుస్తుంది. 1:58 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ లో అటు కామెడీ ఎలిమెంట్స్ తో పాటు, సినిమాలో ఉండబోయే యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసింది రాజుగాడు టీమ్.

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంజనా రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.