రాజుగాడు ఫస్ట్ సింగిల్ – 100% యూత్ ఫుల్

Monday,April 30,2018 - 06:45 by Z_CLU

రాజ్ తరుణ్ , అమైరా దస్తూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘రాజుగాడు’ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ రోజు రిలీజయింది. ఈ సాంగ్ కి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశాడు. గోపీ సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.

‘రబ్బరు బుగ్గల రామ్ చిలకా…రయ్ అంటున్నా నీ వెనక..’ అంటూ సాగే ఈ సాంగ్ లిరిక్స్ యూత్ కి కనెక్ట్ అవ్వడమే కాదు, హమ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి.  ఫోక్ స్టైల్ లో కంపోజ్ అయిన ఈ సాంగ్ సినిమాలో హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో హీరోయిన్ ని ఇంప్రెస్ చేసే సిచ్యువేషన్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ లిరికల్ వీడియోలో ఇన్సర్ట్ చేసిన కొన్ని షాట్స్  సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ ని ఎలివేట్ చేస్తున్నాయి.

సంజనా రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. మే 11 న  ఈ  సినిమా రిలీజవుతుంది.