సంక్రాంతికి పోటీ పెంచడం మా ఉద్దేశం కాదు

Saturday,January 06,2018 - 10:03 by Z_CLU

ఈ సంక్రాంతికి పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి వస్తోంది. ఆ తర్వాత 2 రోజులకు బాలయ్య నటించిన జై సింహా థియేటర్లలోకి వస్తోంది. ఇలాంటి రెండు బడా సినిమాలకు పోటీగా బరిలో దిగాడు రాజ్ తరుణ్. రంగులరాట్నం సినిమాను సంక్రాంతికి విడుదల తీసుకొస్తున్నాడు. ఇద్దరు పెద్ద స్టార్స్ తో పోటీకి దిగడంపై ఈ హీరో స్పందించాడు.

“సంక్రాంతికి వస్తున్నందుకు పెద్దగా టెన్షన్ లేదు. సంక్రాంతికి కనీసం 3-4 సినిమాలకు స్కోప్ ఉంది. సంక్రాంతికి దిగుతున్నారు ఏంటి ఇంత ధైర్యం అని చాలామంది అడిగారు. ఇక్కడ ధైర్యం కాదు, మార్కెట్లో ఆ స్కోప్ ఉంది. బడా సినిమాలకు పోటీ ఇవ్వడం మా ఉద్దేశం కాదు. సంక్రాంతికి ఫ్యామిలీస్ తో సినిమాకు వెళ్లాలనుకుంటారు. ఆ టైమ్ కు మా సినిమా కరెక్ట్ గా సింక్ అవుతుంది. అందుకే వస్తున్నాం. అంతే తప్ప ఎలాంటి పోటీ ఇవ్వాలని కాదు.” సంక్రాంతి పోటీపై రాజ్ తరుణ్ వెర్షన్ ఇది.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా తెరకెక్కింది రంగులరాట్నం సినిమా. సెన్సార్ పూర్తయిన వెంటనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. డైరక్టర్ శ్రీరంజని, హీరోయిన్ చిత్రా శుక్లా ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయమౌతున్నారు.