రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ

Monday,May 28,2018 - 04:45 by Z_CLU

జూన్ 1 న గ్రాండ్ గా రిలీజవుతుంది రాజ్ తరుణ్. U/A సర్టిఫికెట్ తో సెన్సార్ క్లియర్ అయిన ఈ సినిమా, టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్  బజ్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు ఈ సినిమా గురించి రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విషయాలు మీకోసం…

ఇదే మంచి తరుణం… 

‘అంధగాడు’ సెట్స్ పై ఉన్నప్పుడే ఈ సినిమా సార్ట్ అయింది. మా లెక్క ప్రకారం ఈ సినిమా సంక్రాంతికే రిలీజవ్వాలి. కానీ ‘రంగులరాట్నం’ రిలీజయింది. ఇంకా అప్పటి నుండి మంచి డేట్ చూసుకుని, ఈ సినిమాని   ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం…

 

ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్…

కంప్లీట్ సినిమా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఒక 2 గంటలు హ్యాప్పీగా రిలాక్స్ అవుతూ సినిమా చూసేయొచ్చు.

అదే సినిమా…

హీరోకి క్లెప్టోమేనియా ఉంటుంది. దానివల్ల తన కళ్ళ ముందు ఏం కనిపించినా, దొంగతనం చేస్తుంటాడు. దానివల్ల అందరూ ఉద్యోగం లోంచి పీకేస్తుంటారు. అలాంటి కుర్రాడి లైఫ్ లో ఒక  కాంఫ్లిక్ట్, ఆ తరవాత అన్నీ దాటుకుని చివరికి హ్యాప్పీ ఎండింగ్ ఎలా అవుతుందనేదే కాన్సెప్ట్…

స్పీడ్ తగ్గించాలి…

ఒక సినిమా కంప్లీట్ అయ్యాకే ఇంకో సినిమా చేయాలి అనుకునుంటున్నా… దాంతో కంప్లీట్ గా కాన్సంట్రేట్ చేసే అవకాశం దొరుకుతుంది. అందుకే స్పీడ్ తగ్గిద్దామనుకుంటున్నా…

మన చేతుల్లో ఉండదు…

సినిమా ఏదైనా అద్భుతమనిపిస్తేనే చేస్తాం.. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి మన చేతుల్లో ఉండవు.  నేను చేసే ప్రతి సినిమా  నాకు స్పెషలే…

నెక్స్ట్ సినిమాలు…

‘లవర్’ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. దీని తరవాత కుమారి 21 F  డైరెక్టర్ సూర్య ప్రతాప్ తో సినిమా ఉంటుంది. వశిష్ఠ్ అనే కొత్త డైరెక్టర్ తో ఇంకో సినిమా ఉంటుంది…

 

అందుకే లేట్…

సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో సినిమా లేట్ అవ్వడానికి రీజన్ స్క్రిప్ట్ వర్కే. ఒకసారి కంప్లీట్ అయిందంటే సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుంది.