రాజ్ తరుణ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,May 30,2017 - 05:39 by Z_CLU

ఇప్పుడున్న హీరోయిన్లలో రాజ్ తరుణ్ కు ఎవరంటే బాగా ఇష్టం..? ఇక సినిమాలకు సంబంధించి రాజ్ తరుణ్ కు అస్సలు నచ్చని విషయం ఏంటి..? ఒకే ఒక్క సందర్భంలో రాజ్ తరుణ్ తెగ టెన్షన్ పడుతుంటాడు. ఆ సిచ్యుయేషన్ ఏంటి..? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను zeecinemalu.comతో ఎక్స్ క్లూజివ్ గా షేర్ చేసుకున్నాడు రాజ్ తరుణ్.

అంధగాడు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ?

ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ అంటే అది కథే. డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ గారు ఈ కథ చెప్పిన వెంటనే బాగా నచ్చేసింది. కేవలం అంధుడి క్యారెక్టర్ నే కాదు అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్ని జానర్స్ కలగలిపిన కథతో తెరకెక్కిన సినిమా ‘అంధగాడు’.


ఈ సినిమాలో అంధుడిగా ఎంతసేపు కనిపిస్తారు ?

సినిమాలో దాదాపు ఓ 40 నిమిషాల వరకూ అంధుడిగానే కనిపిస్తా. కళ్ళు రాగానే నా క్యారెక్టర్ ఏమాత్రం చేంజ్ ఉండదు. నా క్యారెక్టర్ సినిమా మొత్తం ఒకేలా ఉంటుంది. పెద్దగా వేరియేషన్ కనిపించదు. ఎంటర్టైన్మెంట్స్ ఏ మాత్రం మిస్ అవ్వదు. కానీ కథలో కొన్ని ట్విస్టులొస్తాయంతే…

సినిమాకు ముందే బిజినెస్ కంప్లీట్ అయింది. రిలీజ్ కి ముందే ప్రాఫిట్ అంటున్నారు..?

నేను ఎప్పుడు బిజినెస్ గురించి పట్టించుకోను. సినిమాకి ఎంతో మంది కష్టపడతారు. వాళ్ళ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తారు. సినిమా బాగా వచ్చిందా.. ప్రేక్షకులకి నచ్చిందా.. సక్సెస్ అయిందా లేదా.. ప్రొడ్యూసర్ కి డబ్బులు మిగిలాయా అంత వరకే ఆలోచిస్తా.. కలెక్షన్స్ గురించి కానీ మిగతా వాటి గురించి కానీ కనుక్కోవడం నాకు అలవాటు లేదు. మొన్నే తెలిసింది ఓవర్సీస్ లో లాస్ట్ సినిమా బాగా కలెక్ట్ చేసిందని. విని సంతోషిస్తా తప్ప, ఎంత కలెక్ట్ చేసిందని ఎవ్వరినీ కనుక్కోను కూడా..

హెబ్బా తో మళ్ళీ మళ్ళీ చేయాలని ఎందుకు అనిపిస్తుంది?

నిజానికి యాక్టింగ్ పరంగా కో యాక్టర్ మనకి కంఫర్ట్ గా ఉండాలనుకుంటాం. అలా ఉంటేనే సీన్ పండుతుంది. సో యాక్టింగ్ లో మేమిద్దరం చాలా కంఫర్ట్ గా ఉంటాం. బహుశా అందుకే మా ఇద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలొచ్చాయనుకుంటా. హెబ్బా చాలా మంచి యాక్ట్రెస్. కొన్ని సార్లు షూట్ లో పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తుంది. మొన్నే అనుకున్నాం ఇక మనం కలిసి ఇప్పట్లో సినిమా చేయకూడదు మరీ రిపీట్ గా సినిమాలు చేస్తున్నాం అని.. ఇక మూడు సినిమాలే కాదు తనతో మరో 30 సినిమాలు చేయాలనుంది. దానికే ఒకే ఒక్క రీజన్ మా మధ్య కంఫర్ట్ ఉండటమే..

ఈ సినిమా విషయం లో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు..?

నిజంగా ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నా. నాకే కాదు మా ప్రొడ్యూసర్స్ కి కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే రిలీజ్ కి ముందే ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు..

హెబ్బా-అను ఇమ్మానుయేల్-అవికా గోర్ లలో ఎవర్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నారు.?

అందరినీ రిపీట్ చేయాలనుకుంటున్నా.. ఇప్పటికే ముగ్గురితో రిపీటెట్ గా నటించాను.
ఇక సినిమా విషయానికొస్తే నాకంటూ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండదు. డైరెక్టర్ -ప్రొడ్యూసర్ ఎవరైతే కథకి క్యారెక్టర్ కి బాగుంటుందని అనుకుంటారో వాళ్ళనే పెట్టుకుంటారు. అందులో నా ఇన్వాల్మెంట్ అస్సలు ఉండదు. కొన్నిసార్లు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం వల్ల డైరెక్టర్స్- ప్రొడ్యూసర్ వాళ్ళైతే బాగుంటుందని వాళ్ళని సెలెక్ట్ చేస్తారే తప్ప నా పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఎవ్వరినీ ప్రిఫర్ చేయను. అది నాకు నచ్చదు..


ఏకే కె ఎంటర్టైన్మెంట్స్ లోనే మరో రెండు సినిమాలు చేస్తున్నారట..నిజమేనా?

ఏకే ఎంటర్టైన్మెంట్స్ అంటే నా ఓన్ బ్యానర్ అని ఫీలవుతా.. ప్రెజెంట్ ఇదే బ్యానర్ లో రాజు గాడు (యమ డేంజర్) అనే సినిమా చేస్తున్నా అది క్లిఫ్టో మేనియా(తెలియకుండా దొంగతనం చేయడం) అనే కాన్సెప్ట్ తో ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.. మాట్లాడుతూ మాట్లాడుతూ తనకే తెలియకుండా ఏదో వస్తువుని జేబులో పెట్టేసుకుంటాడు. ప్రస్తుతానికి ఈ బ్యానర్ లో ఇదొక్కటే చేస్తున్నా. ఇంకో సినిమా అంటూ ఏం లేదు. ఇంకా ఏం అనుకోలేదు.

కథలో బాగా ఇన్వాల్వ్ అవుతారని..సలహాలు ఇస్తుంటారని టాక్ దీని గురించి ?

ఒక డైరెక్టర్ కి మనకి ఒక కథ చెప్పినప్పుడు జెనరల్ గా మనకనిపించిన కొన్ని ఐడియాలు చెప్తుంటాం.. అది కామనే. నాకు డైరెక్షన్ లో అనుభవం ఉంది కాబట్టి ప్రీ ప్రొడక్షన్ టైంలో కాస్త స్క్రిప్ట్ వర్క్ లో నాకు అనిపించినవి చెప్తుంటా. కానీ కథలో ఎలాంటి మార్పులు చెయ్యమని, సీన్స్ మార్చమని ఎప్పుడూ చెప్పలేదు. చెప్పను కూడా. సినిమా సెట్స్ పైకి వెళ్ళాక ఇక డైరెక్టర్ నే ఫాలో అయిపోతా…

మీ మీద హెబ్బా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి.. వాటి పై మీరిచ్చే క్లారిటీ ?

హెబ్బా నేను కలిసి వరుసగా చేస్తున్నాం కాబట్టి అలా రూమర్స్ వస్తున్నాయి.. ఒక వ్యక్తి మన గురించి ఏదో కల్పించి రాస్తున్నాడంటే మనం ఫేమస్ అవుతున్నట్టే. అది వదిలేస్తే గాసిప్స్ రాసే వాళ్ళని మనం ఏం అనలేం. సో వాటిని చదవను. పెద్దగా పట్టించుకోను. కొన్నిసార్లు ఎవరైనా చూపిస్తే చూసి నవ్వుకుంటా. మా ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడైనా ఇంటికెళ్లినప్పుడు నీకు పెళ్లయ్యిందంట కదా చెప్పలేదే అంటూ సరదాగా ఏడిపిస్తుంటారు.

మీరే కొన్ని కథలు రాసుకున్నారంట కదా.. నిజమేనా..ఇప్పటి వరకూ ఎన్ని కథలు రాసుకున్నారు..?

చదువుతున్న రోజుల్లో నుంచి డైరెక్టర్ అవ్వాలనుకునే వాడిని. ఇండస్ట్రీ కి కూడా డైరెక్టర్ అవుదామనే వచ్చాను. అనుకోకుండా నటుడినయ్యా. ఇక ఖాళీ సమయాల్లో నాకు అనిపించిన పాయింట్స్ కథలుగా రాస్తుంటాను. ఎన్ని అంటే చెప్పలేను.. కొన్ని ఉన్నాయి.

ఇప్పట్లో డైరెక్షన్ చేసే ఆలోచనేమైనా.. ?

ప్రెజెంట్ ఆ ఆలోచనే లేదు. డైరెక్షన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మినిమమ్ ఏడాది కేటాయించాలి. మంచి స్క్రిప్ట్ రెడీ చేసి దానికి సంబంధించి అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు నాకు అంత టైం లేదు. కానీ డైరెక్షన్ చెయ్యాలని ఉంది. టైం వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తా..

డైరెక్షన్ చేస్తే ఆ సినిమాలో మీరే హీరోగా నటిస్తారా?

అస్సలు చేయను. మిగతా హీరోలతోనే చేస్తా. నేను డైరెక్షన్ చేసితే ఒక్క సీన్ లో కూడా కనిపించను. అది నాకు నేను పెట్టుకున్న రూల్. ఏం చేసినా 100 % ఎఫర్ట్ పెట్టి చేయాలన్నది నా ఉద్దేశ్యం.


రకుల్,రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠి,రెజీనా.. వీళ్ళలో ఎవరంటే ఎక్కువ ఇష్టం..?

అందరు ఇష్టమే అందరితో కలిసి వర్క్ చేయాలని ఉంది. ఇక లేటస్ట్ గా రారండోయ్ వేడుక చేద్దాం సినిమా చూసాను. రకుల్ ఫెంటాస్టిక్ గా నటించింది. ప్రెజెంట్ ఎవరెక్కువ ఇష్టం అంటే మాత్రం రకుల్ పేరే చెప్తా..

మీ మొదటి సినిమా ఉయ్యాలా జంపాల దర్శకుడితో మళ్ళీ సినిమా ఎప్పుడు ?

విరించి టాలెంటెడ్ డైరెక్టర్. ఆల్రెడీ తాను డైరెక్ట్ చేసిన రెండో సినిమా మజ్ను లో ఓ గెస్ట్ రోల్ చేశా. విరించి కథ చెప్తే ఎప్పుడైనా సినిమా చేయడానికి నేను రెడీ.

ఇప్పటివరకూ ఆల్మోస్ట్ అందరు కొత్తోళ్లతోనే చేశారు.. స్టార్ డైరెక్టర్స్ తో సినిమా ఎప్పుడు చేస్తారు?

ఈ క్వశ్చన్ నన్ను కాదు వాళ్లనే అడిగితే బెటర్. ఏ హీరోకైనా స్టార్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. నాకు కూడా ఉంది. కానీ ఇప్పటి వరకూ అది కుదరలేదు. దేనికైనా టైం రావాలి.

అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్న సినిమా గురించి ?

ఆ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. రంజని అనే అమ్మాయి. డైరెక్టర్ చాలా విజన్ ఉంది ఆమెకు. సీన్స్ అన్ని చాలా బాగా వస్తున్నాయి. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమాగా తెరకెక్కుతుంది.

దిల్ రాజు బ్యానర్ లో సినిమా సంగతేంటి ?

ఒక సినిమా కన్ఫర్మ్ అయింది. ఆ మధ్య ఆయన బ్యానర్ లో ఓ సినిమా చేయాలి. కానీ డేట్స్ కుదరక చేయలేకపోయా.. ఆ బ్యానర్ లో సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో వెయిటింగ్. ఆ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ దిల్ రాజు గారే చెప్తేనే బాగుంటుంది.

ప్రెజెంట్ ఇండస్ట్రీ లో మీకు క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? వాళ్ళతో ఎలా గడుపుతుంటారు..?

ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరితోనే పరిచయం ఉంది. కానీ క్లోజ్ ఫ్రెండ్ అంటే మాత్రం నిఖిల్ అనే చెప్పాలి. అప్పుడప్పుడు ఇద్దరం కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడల్లా సినిమాలు పక్కన పెట్టి బాగా ఎంజాయ్ చేస్తుంటాం.


రిలీజ్ కి ముందు బాగా టెన్షన్ పడతారంట నిజమేనా?

నిజమే. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది రిలీజ్ కి రెడీ అవుతుందంటే చాలు కొంచెం టెన్షన్ గా ఫీలవుతుంటా. ఇక రిలీజ్ కి ముందైతే టెన్షన్ మరీ ఎక్కువవుతుంది. అందుకే రిలీజ్ కి ముందు ప్రమోషన్ పూర్తయిన వెంటనే వెకేషన్ ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతా.

ఈ సారి ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు?

బేసిక్ గా ముందు డిసైడ్ అవ్వను. ఆ టైంలో ఎక్కడికి వెళ్లాలని అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతానంతే. ప్రస్తుతం ప్రమోషన్ బిజీ ఉన్నా. అవి పూర్తవ్వగానే రెండు మూడు రోజులు వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటా.