రాజ్ తరుణ్ రెడీ

Friday,October 14,2016 - 09:30 by Z_CLU

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తన లవర్ కోసం ఓ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘కుమారి 21 ఎఫ్’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.  వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయంది. సినిమాకు అదే పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమా తరువాత మరోసారి ‘ఈడో రకం-ఆడో రకం’ సినిమాతో అలరించి మరో విజయం తమ ఖాతాలో వేసుకున్నారు వీరిద్దరూ.

kumari-21-f-fb-cover

ఇప్పుడు ఈ సెంటిమెంట్ కలిసి రావడంతో మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. కానీ ఆ సినిమాలో రాజ్ తరుణ్ హీరో కాదు. కేవలం గెస్ట్ పాత్ర లో మాత్రమే కనిపించనున్నాడట. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమాలో ఈ అమ్మడు కోసం ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట రాజ్ తరుణ్. ఈ చిత్ర నిర్మాతలు ఇటీవలే రాజ్ తరుణ్ తో ‘సినిమా చూపిస్తా మావ’ సినిమాను నిర్మించారు. నిర్మాతలు కూడా తనకు తెలిసినవాళ్లే కావడంతో రాజ్ తరుణ్ వెంటనే గెస్ట్ రోల్ కు ఓకే చేసేశాడు.