రాజ్ తరుణ్ తో దిల్ రాజు సినిమా.. త్వరలో సెట్స్ పైకి .

Thursday,September 21,2017 - 03:48 by Z_CLU

ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న రాజ్ తరుణ్ – బ్రాండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది.  ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సినిమా రావాలి..’శతమానం భవతి’ సినిమాను ముందుగా రాజ్ తరుణ్ తో ప్లాన్ చేశాడు దిల్ రాజు కానీ అనుకోకుండా ఆ మూవీ శర్వా లిస్ట్ లో పడింది. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో రాజ్ తరుణ్ తో మా బ్యానర్ లో త్వరలోనే సినిమా ఉంటుందని చెప్పుకొచ్చిన దిల్ రాజు ఎట్టకేలకి రాజ్ తరుణ్ తో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో స్టేజిలో ఉన్న ఈ సినిమాను ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. లవ్ & ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను విజయదశమి రోజు  పూజా కార్యక్రమాలతో ప్రారంభించి అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడట దిల్ రాజు.