ఆ బ్యానర్ లో మరో సినిమా...

Tuesday,May 30,2017 - 10:00 by Z_CLU

టాలీవుడ్లో ప్రెజెంట్ ఒకే బ్యానర్ లో కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో ఎవరా.. అంటే ఠక్కున వినిపించే పేరు రాజ్ తరుణ్. ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న ఈ ఎనర్జిటిక్ హీరో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఇప్పటికే 3 సినిమాలు చేశాడు. ఇప్పుడు ఇంకో సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మొదటిగా ‘ఈడో రకం-ఆడో రకం’ అనే సినిమాలో విష్ణుతో కలిసి నటించిన రాజ్ తరుణ్ ఆ తరువాత ఇదే బ్యానర్ లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాతో పాటు లేటెస్ట్ గా ‘అంధ గాడు’ అనే మరో సినిమా కూడా చేశాడు. ఇలా ఈ బ్యానర్ లో వరుసగా 3 సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇటీవలే ఈ బ్యానర్ లో 30 సినిమాలు చేయాలని ఉందంటూ తెలిపిన రాజ్ తరుణ్.. లేటెస్ట్ గా ఈ ప్రొడక్షన్ లో ఓ కథ విని అది బాగా నచ్చడంతో ఇదే బ్యానర్ లో మరో సినిమా కమిట్ అయిపోయి డేట్స్ కూడా ఇచ్చేశాడని సమాచారం.